సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళదామన్నారు. ఉప్పల్, రామాంతాపూర్, అంబర్‌పేట ఎక్కడికి వస్తారో సీఎం చెప్పాలని.. దీనికి సీఎం సిద్ధమా? అని సవాల్ విసిరారు. రేవంత్ పాలన బాగుంది అంటే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మంచి పని చేస్తున్నారని ప్రజలు అంటే ముక్కు నేలకు రాస్తానని వ్యాఖ్యానించారు.