Homeతెలంగాణపుట్టిన రెండు రోజుల్లోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నారి.. లైఫ్‌టైం ఫ్రీ బస్ పాస్.. ఎందుకంటే?

పుట్టిన రెండు రోజుల్లోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నారి.. లైఫ్‌టైం ఫ్రీ బస్ పాస్.. ఎందుకంటే?

కరీంనగర్ బస్‌ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి TGSRTC జీవితకాల ఉచిత బస్ పాస్ ప్రకటించింది. ఇటీవల గర్భిణికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బందిని సంస్థ ఉన్నతాధికారులు సన్మానించారు. కరీంనగర్ బస్టాండ్ లో ఈనెల 16న కూమారి అనే గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవితకాల ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img