Homeహైదరాబాద్latest Newsపాపం.. నిమ్మకాయ నోట్లో పెట్టుకున్న చిన్నారి.. ఊపిరాడక మృతి

పాపం.. నిమ్మకాయ నోట్లో పెట్టుకున్న చిన్నారి.. ఊపిరాడక మృతి

పాపం వాళ్లకి పెళ్లైన ఏడేళ్ల తర్వాత పండింటి ఆడపిల్ల పుట్టింది. లేకలేక పుట్టిన ఆడపిల్లను మహాలక్ష్మిలా అపురూపంగా పెంచుకుంటున్నారు. అయితే, వారికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఏడేళ్ల ఎదురుచూపుల తర్వాత పుట్టిన పాప ఏడాది కూడా నిండకముందే కన్నుమూసింది. అనంతపురం, పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సకీదీప, గోవిందరాజుల 9 నెలల పాప పేరు జశ్విత.

వివరాల ప్రకారం.. తల్లి సకీదప ఇంట్లో పని చేస్తుంది ఈ క్రమంలో పాప వంటింట్లో ఆడుకుంటూ నిమ్మకాయ మింగింది. గమనించిన తల్లి వెంటనే నిమ్మకాయను తీయడానికి ప్రయత్నించింది. నిమ్మకామ బయటకు రాకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు పాప ఊపిరాడక చనిపోయిందని నిర్ధారించారు. లేకలేక పుట్టిన బిడ్డ దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. జశ్విత మృతితో మల్లేనిపల్లిలో విషాదం నెలకొంది.

Recent

- Advertisment -spot_img