Homeహైదరాబాద్latest Newsఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతుండగా.. రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి.. (VIDEO VIRAL)

ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతుండగా.. రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి.. (VIDEO VIRAL)

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. ఇందిరానగర్ రైల్వే క్రాసింగ్ వద్ద అక్షువీర్ సింగ్ (27) అనే కానిస్టేబుల్ రైలు ఢీకొని మృతి చెందాడు. కానిస్టేబుల్ రాత్రివేళలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే లైన్ దాటుతుండగా లక్నో నుంచి బరేలీకి వెళ్తున్న హైస్పీడ్ రైలు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

spot_img

Recent

- Advertisment -spot_img