భారత్ లో చాందిపురా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. గత 20ఏళ్లలో భారత్లో అతిపెద్ద వైరస్ వ్యాప్తి ఇదేనని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. దేశవ్యాప్తంగా 43 జిల్లాల్లో చాందిపుర వైరస్ వ్యాప్తి చెందిందని తెలిపింది. జూన్ నుంచి ఆగస్టు 15 మధ్య 245 యాక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ వైరస్లో 82 మంది మృతి చెందారని పేర్కొంది.