Homeహైదరాబాద్latest News‘దేవర' సినిమా చూస్తూ అభిమాని మృతి

‘దేవర’ సినిమా చూస్తూ అభిమాని మృతి

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్సర థియేటర్లో సినిమా చూస్తూ మస్తాన్ వలీ అనే అభిమాని ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు వల్లే మస్తాన్ వలీ మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు సీకే దిన్నె మండలం జమాపల్లికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img