Homeజిల్లా వార్తలుదొంగల ముఠా తిరుగుతోంది.. ఈఎంఐ పేరుతో కొత్త మోసం.. ప్రజలు తస్మాత్‌ జాగ్రత్త….!

దొంగల ముఠా తిరుగుతోంది.. ఈఎంఐ పేరుతో కొత్త మోసం.. ప్రజలు తస్మాత్‌ జాగ్రత్త….!

ఇదేనిజం, కంగ్టి: కంగ్టి మండలంలోని అనుమానిత అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ శనివారం రాత్రి తెలిపారు. విశ్వసనియా సమాచారం మేరకు దొంగలు గ్రామాలలో తిరుగుతూ ప్రీజ్లు, ఏసీలు తక్కువ ధరకు ఇస్తామని దానికి ఈఎంఐ సౌకర్యం కూడా ఇస్తామని నమ్మబలికి ప్రజల దగ్గర నగదు వాసులు చేస్తున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. 5వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే నెల నెల 500 రూపాయలు కడితే ప్రీజ్లు, ఏసీలు టీవీలు, మీ ఇంటికె డోర్ డెలివరీ చేస్తామని ప్రజల దగ్గర 5వేలు నగదు వాసులు చేసి మోసం చేస్తున్నారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img