సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టికి తెలుగు నాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంత గ్యాప్ ఇచ్చిన ఒక సరైన సినిమాతో వచ్చి మళ్లీ ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకోగల సత్తా ఈ బ్యూటీ సొంతం. ఇటీవల వచ్చిన మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి కథ పరంగా మెప్పించినప్పటికీ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఆ మూవీ అనుష్కకు మంచి బ్రేక్ ఇస్తుందనే అందరూ భావించారు. కానీ ఈ కాన్సెప్ట్ నిరాశ పరిచింది. ఇప్పుడు మరోసారి యూవీ క్రియేషన్స్ స్వీటీకి మంచి కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు. ఒక చిన్న గాసిప్ కూడా లేకుండా ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లిపోయింది. నిజానికి అనుష్క- క్రిష్- యూవీ క్రియేషన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేశారనే చెప్పాలి. అసలు ఈ సినిమా కి సంబంధించి అన్ని సైలెంట్గా జరిగిపోయాయి అనుష్క- క్రిష్ కాంబోలో సినిమా రాబోతోంది అనే వార్త జనాల్లోకి వచ్చేలోపే..ఏకంగా సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.పైగా లీడ్ రోల్ చేస్తోంది అనుష్క కాబట్టి యాక్టింగ్ విషయంలో ఎక్కడా తగ్గదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తనకి బాగా కలిసొచ్చే దారిలో ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుష్క నటిస్తుంది అంటూ వార్తలు బైటికొచ్చాయీ . ఈ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు అని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా స్టోరీ లైన్ కూడా చెప్పేస్తున్నారు. అనుష్కా శెట్టి కొత్త సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.యీ లాజిక్ మాత్రం కాస్తో కూస్తో నమ్మశక్యంగానే ఉంది. ఇటీవల ఆంధ్రా- ఒడిశా బోర్డర్ లో అనుష్క- క్రిష్ మూవీ షూటింగ్ జరిగింది అంటున్నారు.అలాగే ఇటీవల ఒక హోటల్ నుంచి అనుష్క వస్తున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. ఆ వీడియో ఎక్కడా అని ఆరా తీయడం స్టార్ట్ చేస్తే అది ఒడిశా అని తెలిసిందంట. అలాగే ఒడిశా బోర్డర్ లో షూట్ అనగానే ఇప్పుడు వీటన్నింటిని ముడిపెడుతూ ఒక స్టోరీ లైన్ చెప్తున్నారు. ఒడిశాలోని ఒక లేడీ జీవితంలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.