Homeహైదరాబాద్latest Newsబండరాయితో తలపై కొట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య..!

బండరాయితో తలపై కొట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య..!

ఇదే నిజం, నార్నూర్: అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల కొండ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం పాఠశాల పునర్ ప్రారంభం కావడంతో విధులకు హాజరయ్యేందుకు తన స్వగ్రామం నాగల కొండ నుంచి జైనథ్ మండలం మేడిగూడకు బైక్ పై బయలుదేరాడు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై కొట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. గజేందర్ ఆదిలాబాద్ లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది కుటుంబ తగాదాల కారణంగా లేక వేరే ఏదైనా కారణంగా హత్య జరిగి ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img