ఇదే నిజం, ధర్మపురి(ఎండపల్లి): తెలంగాణ తెలుగు చిత్ర పరిశ్రమకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సలహాదారుడిగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల గుల్లకోట గ్రామ ముద్దుబిడ్డ దర్శకుడు, న్యాయవాది ఇటీవల నియమితులైన శుభ సందర్భంగా గురువారం రోజున గుల్లకోట గ్రామ ప్రముఖులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. సినీరంగం పైకి కనిపించినంత రంగుల కళ కాదని దర్శకుడు సాన యాది రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బిసగోని సత్యం గౌడ్, గొల్లపల్లి మల్లేశం గౌడ్, భూసారపు భూమయ్య, గోని సంతోష్, గూని సురేష్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పొన్నం తిరుపతి, భూసారపు రవి, సన మారుతి,దేవ మైపాల్ రెడ్డి, గొల్లపల్లి శంకరయ్య, మడ్డి మహేష్, బిసగుని తిరుపతి, బిసగోని అంజు, బిసగోని రాజు, అరిగిన రవి, వనం నాగరాజు, వనం కుమార్, మిట్ట నరేష్, గుండా రామస్వామి, మూల ప్రశాంత్,పొన్నం వెంకటేష్, గుండ మహేష్, గుండ శ్రీను గ్రామస్థులు పాల్గోన్నారు.