Homeహైదరాబాద్latest Newsవిలేజి డెవలప్మెంట్ సొసైటీ కోఆర్డినేటర్ కు ఘన సన్మానం

విలేజి డెవలప్మెంట్ సొసైటీ కోఆర్డినేటర్ కు ఘన సన్మానం

ఇదే నిజం దేవరకొండ: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ నడిపిస్తున్న కోఆర్డినేటర్ లావుడియా భాష నాయక్ ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గతం 35 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మారుమూలం ప్రాంతమైనటువంటి దేవరకొండ ప్రాంతంలో అనేక సమస్యల మీద పోరాటం స్వచ్ఛంద సంస్థ ద్వారా కంప్యూటర్ ట్రైనింగ్, కుట్టుమిషన్ల శిక్షణ, ఇవ్వడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కులవత్తుల పైన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నందుకుగాను ధన్యవాదాలు తెలిపారు. ముందు ముందు ఈ ప్రాంతానికి ఎన్నో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చేటువంటి పథకాలు లబ్ధి పొందుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సన్మానించిన వారిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి చోల్లేటి భాస్కరాచారి, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ళ కృష్ణ చారి, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు చేరుపల్లి జయలక్ష్మి, కొర్ర కిషన్ నాయక్,గౌరోజి బ్రహ్మచారి,కూరెళ్ళ రామకృష్ణ చారి, ఇనిస్టిట్యూట్ విద్యార్థినిలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img