Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్‌కి గట్టి ఎదురు దెబ్బ.. మహబూబ్‌నగర్‌.. మల్కాజిగిరి.. ఓటమి దిశగా కాంగ్రెస్..

సీఎం రేవంత్‌కి గట్టి ఎదురు దెబ్బ.. మహబూబ్‌నగర్‌.. మల్కాజిగిరి.. ఓటమి దిశగా కాంగ్రెస్..

మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ ఆధిక్యంతో బరిలోకి దిగుతున్నారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి లక్షా నలభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేసిన ఈ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో పాటు మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ దిశగా పయనిస్తోంది. ఇదే రేవంత్ కి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

Recent

- Advertisment -spot_img