Homeవిచిత్రంఫ్లైట్​లో బోను నుంచి తప్పించుకున్న గుర్రం

ఫ్లైట్​లో బోను నుంచి తప్పించుకున్న గుర్రం

– ఎయిర్​ అట్లాంటా ఐస్ లాండిక్ బోయింగ్ విమానంలో ఘటన

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఫ్లైట్​లోని బోను నుంచి గుర్రం తప్పించుకున్న ఘటన ఎయిర్‌ అట్లాంటా ఐస్‌లాండిక్‌కు చెందిన బోయింగ్‌ విమానంలో జరిగింది. ఇటీవల న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే నుంచి బెల్జియంకు బోయింగ్‌ 747 విమానం బయలుదేరింది. దానిలోని ఒక గుర్రాన్ని కూడా రవాణా చేస్తున్నారు. టేకాఫ్‌ అయిన 30 నిమిషాల తర్వాత బోను నుంచి గుర్రం తప్పించుకుని అందులోనే తిరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. గుర్రం ఒక్కసారిగా బయటకు దూకడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. గుర్రం బయటకు వచ్చిన విషయాన్ని సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానం బరువు ఎక్కువగా ఉండడంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్‌ సముద్రంలో డంప్‌ చేయాల్సి వచ్చిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా, విమానాన్ని తిరిగి న్యూయార్క్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అనంతరం విమానాశ్రయ సిబ్బంది గుర్రాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గుర్రానికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, గాయాల తీవ్రత మాత్రం వెల్లడించలేదు. గతంలోనూ ఇలాంటి ఓ ఘటన ఇరాకీ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో చోటు చేసుకుంది. ఓ ఎలుగుబంటి పెట్టెలోంచి బయటకు వచ్చి హాయిగా చక్కర్లు కొట్టింది. దీంతో విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.

Recent

- Advertisment -spot_img