హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుంది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది.ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.