లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ చకుర్కర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు.
అర్చన శుక్రవారం బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఆమె ముంబైలో రేపు బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.