–బ్రిటీష్ కాలం నాటిదిగా అనుమానం?
ఇదేనిజం, ఏపీ బ్యూరో: విశాఖ బీచ్ కు భారీ దిమ్మె కొట్టుకొచ్చింది. దీంతో సందర్శకులు భారీ సంఖ్యలో తీరప్రాంతానికి చేరుకొని చెక్క దిమ్మెను చూసేందుకు ఎగబెట్టారు. తొలుత అధికారులు దీన్ని చెక్కపెట్టగా భావించి.. లోపల పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని అనుమానించారు. చివరకు ప్రొక్లెయిన్ సాయంతో ఆ దాన్ని బద్దలు కొట్టారు. అయితే అది భారీ చెక్కదిమ్మె అని తేలింది. ఈ భారీ ఆకృతిలోని చెక్క దిమ్మె బ్రిటీష్ కాలం నాటిదిగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇచ్చారు.