విమానాలు బయల్దేరే సమయం ముందుగా ప్రకటించిన దాని కన్నా మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నపుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలను ఆదేశించారు. ఢిల్లీలో పొగ మంచు కమ్మేస్తున్న నేపథ్యంలో వైమానిక సంస్థల సన్నద్ధతపై ఆయన సమీక్షించారు.