ఇదే నిజాం, చెన్నూర్ టౌన్ : చెన్నూర్ మండలంలో జోడువాగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న లారీ ఒకటి ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను ముందుగా చెన్నూర్ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు చెన్నూర్ సీఐ రవీందర్ తెలిపారు. గాయపడిన యువకులను వేమనపల్లి మండలంలోని రాజారం గ్రామానికి చెందిన నాయిని గోవర్ధన్, సుమన్‌గా గుర్తించినట్లు చెప్పారు.