ఆంధ్రప్రదేశ్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.