ఓ ప్రేమ జంట అడ్డంగా బుక్కైంది. నది ఒడ్డున ఒంటరిగా కలుసుకున్న వారిని పట్టుకున్న గ్రామస్తులు వారికి బలవంతంగా వివాహం చేశారు. బిహార్లోని జాముయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలోనూ వీరు నది ఒడ్డున దొరకడంతో గ్రామస్తులు కొట్టారు. అయినా మారకుండా మరోసారి దొరకడంతో చేసేది లేక వారికి పెళ్లి చేశారు. పటౌనా గ్రామంలోని కియుల్ నది ఒడ్డున ఈ సంఘటన జరిగింది.