ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామానికి చెందిన అలిశెట్టి ఆనందం తండ్రి మల్లేశం వయస్సు45 సంవత్సరాలు అనునతడు గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసైనాడని,ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నిన్నటి అనగా సోమవారం రోజున పగలు 01:30 గంటలకు తన ఇంట్లో గల దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసుకొని మరణించినాడని అతని భార్య అలిశెట్టి రుక్మిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి ఎస్సై సీహెచ్ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.