Homeహైదరాబాద్latest Newsవికారాబాద్ లో చిరుత కలకలం ఓ వ్యక్తిపై దాడి.. స్వల్ప గాయాలు

వికారాబాద్ లో చిరుత కలకలం ఓ వ్యక్తిపై దాడి.. స్వల్ప గాయాలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: చిరుత పులి కలకలం రేపిన ఘటన వికారాబాద్ జిల్లా కొత్తపల్లిలో చోటు చేసుకున్నది. ఇటీలవ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల చిరుత పులులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా బహిర్‌భూమికి వెళ్లిన వ్యక్తిపై చిరుత దాడిచేసింది. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శేఖర్‌ అనే వ్యక్తి బహిర్‌భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో అతనిపై చిరుత దాడిచేసింది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చిన శేఖర్‌ను పులి వెంటాడింది. అయితే అతని అరుపులు విన్న స్థానికులు ఇండ్ల నుంచి బయటకు రావడంతో అది అక్కడి నుంచి పరారయింది. గాయపడిన శేఖర్‌ను కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్‌ దవాఖానకు తరలించారు.

Recent

- Advertisment -spot_img