ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలోని తారానగర్ లో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన తన్నీరు మాల్యాద్రి (37) సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ శేరిలింగంపల్లి తారానగర్‌లో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా దసరా సెలవుల నేపథ్యంలో భార్య పిల్లలు ఊరికి వెళ్ళారు. ఈ క్రమంలో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అయితే మంగళవారం రాత్రి అతని ఇంటిలోనే మాల్యాద్రి దారుణంగా హత్య గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది మాల్యాద్రి మర్మాంగాల మీద దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ని రప్పించి చుట్టుపక్కల జగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కూడా ఉండడంతో తాగిన మత్తులో ఏమైనా గొడవ జరిగిందా లేదా ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.