హైదరాబాద్కి చెందిన వంశీ కృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేసాడు. ప్రస్తుతం అతడి కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పెట్టి యువతలకి వేలం వేసి మోసం చేస్తున్నాడు. పెళ్లిచూపుల అనంతరం కట్నకానుకలు తీసుకుని ముఖం చాటేసిన మోసాలకు పాల్పడుతున్నాడు. ఇటీవలే ఓ మహిళా డాక్టర్ను రూ.50 లక్షల మేర మోసం చేయడంతో ఇతగాడి అతడి బాగోతాలు బయటపడ్డాయి.