Homeక్రైంరూ.350 కోసం యువకుడిని చంపిన మైనర్

రూ.350 కోసం యువకుడిని చంపిన మైనర్

– ఢిల్లీలో దారుణం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రూ.350 కోసం ఓ బాలుడు.. యువకుడిని హత్య చేశాడు. మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ ఢిల్లీలోని వెల్‌కమ్‌ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిపై బాలుడు దాడికి దిగాడు. బాధితుడిపై దాడి చేసి ఊపిరాడనీయలేదు. అతడు స్పృహ కోల్పోయిన తర్వాత తన వద్ద ఉన్న కత్తితో దాదాపు 60 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.350 క్యాష్​ తీసుకొన్నాడు. కొద్దిసేపు మృతదేహం ఎదుట డాన్స్‌ చేస్తూ.. పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ దారుణమంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మైనర్​ను అరెస్టు చేశారు. చనిపోయిన వ్యక్తితో బాలుడికి గతంలో ఎలాంటి పరిచయం లేదని తేలింది. కేవలం డబ్బు కోసమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img