– ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు
– రాష్ట్ర సంపద పేదలకు పంచుతాం
– కేసీఆర్ రెస్ట్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చింది
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇదేనిజం, ఢిల్లీ: డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతం జరగబోతున్నదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9 నాడు ఓ అద్భుతం జరిగిందని.. అదే తరహాలో 2023 డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో మరో అద్భుతం జరగబోతున్నదని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెస్ట్ తీసుకొనే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల ఫ్యామిలీ పట్టి పీడిస్తోందన్నారు. తెలంగాణలో ప్రజా ధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంది. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని చెప్పారు.