ఇదే నిజం, శేరిలింగంపల్లి: హైడ్రా కు ఫిర్యాదు చేస్తానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా. విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై సదరు బిల్డర్ హైడ్రా కమిషనర్ కలుసుకొని ఫిర్యాదు చేశాడు. బిల్డర్ ఫిర్యాదుపై విచారించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయం సంగారెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి, సదరు బిల్డర్ తో పోలీసులకు పిర్యాదు చేయించాడు. బిల్డర్ ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న డా. విప్లవ్ ను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.