ఇదే నిజం, వరంగల్ తూర్పు: గంజాయి మొక్కలు పెంచుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన జమీర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మిల్స్ కాలనీకి చెందిన ఎస్సై రంగంలోకిదిగి జమీర్ ఇంటిని సోదాల చేశారు. చేయగా పెరట్లో పెంచిన ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వాసన పీల్చుకొనేందుకుఏ తాను పెరట్లో మొక్కలు పెంచుతున్నానని జమీర్ పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.