నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మలయాళ హీరోయిన్ హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా ఈ భామ ఒక వ్యాపారవేత్త వేధిస్తున్నాడు అని సోషల్ ద్వారా తెలిపింది. ఓ వ్యాపారవేత్త తనపై పదే పదే మాటల దాడికి పాల్పడుతున్నాడని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. నేను 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని, అలాంటి డ్రామా నాకు అవసరం లేదని చెప్పింది. నాలాగే ఇతర ప్రముఖులు ఆయన వ్యాపారాల ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అతను నన్ను పదే పదే టార్గెట్ చేస్తూ తన ఇంటర్వ్యూలలో నా పేరు వాడుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతని చేష్టలతో విసిగిపోయానని, ఇంటర్వ్యూలు లేదా ఇతర సందర్భాల్లో తన పేరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అయితే తనను వేధించిన వ్యాపారి పేరు మాత్రం ఆమె చెప్పలేదు.