టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌ను ఓడించిన భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది. వరల్డ్ కప్‌లో అత్యల్ప టార్గెట్(120)ను డిఫెండ్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. 2014లో శ్రీలంక 120 స్కోరును కాపాడుకుని న్యూజిలాండ్‌పై గెలిచింది. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోరు ఇదే. గతంలో జింబాబ్వేపై 139, ఇంగ్లండ్‌పై 145, బంగ్లాదేశ్‌పై 147 స్కోర్లను డిఫెండ్ చేసుకుంది. ముఖ్యంగా గ్రూప్-ఎలో భారత్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో పాకిస్థాన్‌కు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా 4 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో కెనడా, అమెరికాతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం భారత్‌కు కష్టమేమీ కాదు. పాకిస్థాన్, కెనడాపై గెలిచిన అమెరికా కూడా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ ఇద్దరిలో ఒకరు గెలిచినా అమెరికా ఖాతాలో 6 పాయింట్లు చేరుతాయి. వారి రన్ రేట్ కూడా 0.626 వద్ద మెరుగ్గా ఉంది. కాబట్టి అమెరికాకు సూపర్-8 చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.