ఇదే నిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన రాగుల రమేష్ తండ్రి రాజయ్య వయసు 27 వృత్తి లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవన కొనసాగించే వాడు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో త్రాగుడుకు బానిసై గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. అతని శరీరంలోని అంతర్గత అవయవాలు కాలెయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు చెడిపోయి శుక్రవారం (03.01.2025) ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు నల్లబేల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.