రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లు, రైతుల సమస్యలు పరిష్కారమయ్యేట్లు.. సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు ఉండేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాక ముందే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం లాగా తొందరపాటు చర్యలు తీసుకుని రైతులను సమస్యల కూపంలోకి నెట్టబోమని స్పష్టం చేశారు.