Homeహైదరాబాద్latest Newsఅద్దంలాంటి నది.. మన దేశంలోనే ఉంది..ఎక్కడో తెలుసా..?

అద్దంలాంటి నది.. మన దేశంలోనే ఉంది..ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో చాలా నదుల గురించి తెలుసుకోవాలి. అందులో ఉమ్‌గోట్ నది ఎంతో ప్రత్యేకం. దాకీ సరస్సు అని కూడా పిలిచే ఉమ్‌గోట్ నది, మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ కొండల జిల్లాలో ఉంది. ఈ లేక్ మన దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నీటి వనరుగానూ పేరు తెచ్చుకుంది. ఎందుకంటే, ఈ నదిని చూస్తే ఇక అద్దం అవసరం లేదు. అంత క్లీన్‌గా ఉంటుంది మరి. దీనిలో పడవ ప్రయానం చేస్తుండగా రూపాయి కాయిన్ నదిలోని నీటిలో పడినా, కంటికి స్పష్టంగా కనిపిస్తుంది అని పలువురు పర్యాటకులు అంటున్నారు. దాకీ సరస్సు స్పష్టమైన నీటితో మనసులు దోచేస్తుంది. దీని చుట్టూ ఉన్న పచ్చని కొండలు మరింత ఆకట్టుకుంటాయి. సరస్సు ఒడ్డున వరుసగా నాటిన వెదురు చెట్లు, రంగురంగుల పువ్వులు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చాయి. దాకీ సరస్సుకు సమీపంలో ఉన్న మావ్లిన్నోంగ్ గ్రామం 2003లో ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా ఎంపికైంది. పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ కలిగిన మావ్లిన్నోంగ్ ఊరి ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. వారి కారణంగానే ఈ రివర్ క్లీనెస్ట్ లేక్‌గా నిలిచింది.

Recent

- Advertisment -spot_img