వరంగల్ జిల్లా మామునూరు హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలోని మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఏడుకు చేరుకుంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.