Homeజిల్లా వార్తలుసైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠిన శిక్ష పడేవిధంగా చూస్తాం

సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠిన శిక్ష పడేవిధంగా చూస్తాం

ఇదేనిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తానని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. బుధవారం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. మంగళవారం జీవదాన్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధూ శర్మ మీడియా సమావేశం. నిర్వహించారు. 23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బి ఎం ఎస్, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడేవిధంగా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. మంగళవారం పాఠశాల వద్ద జరిగిన గొడవలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. జిల్లా ఎస్పీ గుర్తు చేశారు. పాఠశాల వద్ద జరిగిన విధ్వంసం లో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగింది వారిపై కఠిన కేసులు పెడతామని ఎస్పీ వెల్లడించారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్థాం అని జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో ప్రకటించారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు, మానసిక స్థితి కొంత బాగోలేదు.సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేయండం జరిగింది జిల్లా ఎస్పీ వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దు అని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img