థాయ్‌లాండ్‌లో ఓ మహిళా సైనైడ్ ఇచ్చి 14 మంది ఫ్రెండ్స్‌ను హతమార్చింది. కాగా.. నిందితురాలు సారారట్(36)కు థాయ్‌లాండ్ కోర్టు మరణశిక్ష విధించింది. గ్యాంబ్లింగ్‌కు బానిసై తరచూ స్నేహితుల వద్ద అప్పులు చేసి.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని సైనైడ్ ఇచ్చి చంపి వారి అడ్డు తొలగించుకుంది. సిరిపర్న్ ఖన్వాంగ్ అనే మహిళ హత్య కేసు విచారణలో భాగంగా సారారట్ దారుణ చర్యలు బయటపడ్డాయి.