సామాన్యులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు, వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో గోధుమ పిండి ధరలు కూడా పెరగనున్నాయి. హోల్ సేల్ మార్కెట్‌లో పిండి ధర 20 శాతం వరకు పెరిగింది. క్వింటాల్‌కి రూ.2250 నుంచి రూ.2800 వరకు పెరిగింది. దసరా, దీపావళి పండగలకు ముందు పిండి ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.