ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. అంతే కాకుండా నందివాడ, గుండ్లవల్లేరు మండలాలలోని వైసీపీ నేతలు టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. టీడీపీ నేత వెనిగండ్ల రాము సమక్షంలో వైసీపీ వైస్ సర్పంచ్ సహా 100 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.