HomeSocial Mediaపండగ వేళ ప్రయాణికులకు షాక్

పండగ వేళ ప్రయాణికులకు షాక్

పండగ వేళ ప్రయాణకులకు అవస్థలు తప్పడం లేదు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళ వాతావారణం అనుకూలించకపోవడంతో పలు సర్వీసులను రద్దు చేశారు. అయితే మధ్యాహ్నం కూడా సర్వీసులను అందుబాటులోకి తేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వెంటనే ఎరోప్లేన్ అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. చివరకు సిబ్బందికి, ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కలగ జేసుకోవడంతో వాగ్వాదం సద్దుమణిగింది. పండగవేళ ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img