బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ నేత, కుమురం భీమ్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్‌లో చేరారు. మహేశ్‌కుమార్ గౌడ్ వారికి కండువాకప్పి ఆహ్వానించారు. వీరికి గాంధీ భవన్ లో టీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఎల్లుండి రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్న వేళ అంతకు ముందే పార్టీ మాజీ ఎంపీ కండువా మార్చడం హాట్ టాపిక్ గా మారింది.