Homeహైదరాబాద్latest Newsమట్టేవాడలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం

మట్టేవాడలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని, అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, మారుమూల గ్రామపంచాయతీ మట్టేవాడ గ్రామం లో, ఈరోజు అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి. యమున ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 43 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న జబ్బులతో బాధపడుతున్న వారికి పరీక్షించి, మాత్రలు ఇచ్చి ముగ్గురు జ్వర పిడితులను గుర్తించి, రక్త నమునాలు సేకరించి ల్యాబ్ కు పంపించారు. క్యాంపు అనంతరం డాక్టర్ యమున తమ వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో డ్రైడే నిర్వహించారు. ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి నీటి నిలువల కంటైనర్స్ లను తొలగించారు. డాక్టర్ బి. యమున మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా, రోగాల బారిన పడకుండా ఉండవచ్చని అలాగే వేడి వేడి ఆహారము తినాలని, వేడిచేసిన మంచినీరును చల్లార్చి తాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో మట్టేవాడ పల్లె దవఖాన డాక్టర్ నరేష్, హెల్త్ అసిస్టెంట్ సర్దార్ బాబు, ఏఎన్ఎంలు కవిత, పుష్పలత, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img