ఇదేనిజం, లక్షెట్టిపేట: న్యాయవాదుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకు రావాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ముందు న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో రెండో పట్టణ ఏఎస్సై న్యాయవాది రవికుమార్ పై దాడిచేయడం చాలా హేయమైన చర్య అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలె గాని భౌతిక దాడులు తగవన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రాజేశ్వర్, రాజేశ్వర్ రావు , కోమిరెడ్డి సత్తన్న,రాజారామ్ రెడ్డి , శ్రీధర్ అక్కల, తిరుపతి స్వామి, నళినికాంత్, రవికుమార్, సత్యగౌడ్, పద్మ , ఉమారాణి, ప్రకాశం, శివశంకర్, వినీత, గణేష్ తదితరులు పాల్గొన్నారు.