ఇదే నిజం, గొల్లపల్లి: కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం భాగంగా గర్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ క్రీడాకారుడు కన్న రమేష్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో గొల్లపెల్లి మండల సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు గురజాల బుచ్చిరెడ్డి, జగన్, జుద్దీన్, ఉమేష్, ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ మండలాలలోని పలువురు సీనియర్ క్రీడాకారు లు పాల్గొనడం జరిగింది.