దొంగకు పులిహోర తినిపించి కొందరు యువకులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో జరిగింది. ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను యువకులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని అనడంతో పులిహోర తినిపించారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు.