Homeతెలంగాణనీట మునిగిన రైల్వేస్టేషన్​

నీట మునిగిన రైల్వేస్టేషన్​

చిక్కుకుపోయిన 800 మంది ప్రయాణికులు

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం స్టేషన్‌ మునిగిపోయింది. దీంతో 800 మంది రైల్వేస్టేషన్​లో చిక్కుకుపోయారు. భారీ వర్షాలతో తమిళనాడులోని దక్షిణ జిల్లాలు జలమయంగా మారాయి. ఫలితంగా దాదాపు 800 మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో చిక్కుకుపోయారు. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇదివరకే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే శ్రీ వైకుంఠంలోని రైల్వే స్టేషన్‌ చుట్టూ నీరు చేరింది. రైలు పట్టాలు దెబ్బతినడంతో రైళ్లు రాకపోకలు సాగించే పరిస్థితి లేకపోయింది. దాంతో ప్రయాణికులు స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. మిగ్‌జాం తుపాను ప్రభావం నుంచి బయటపడకముందే తాజాగా మళ్లీ వర్షాలు పడటంతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ నెల 19న (మంగళవారం) కలిసి రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు.

Recent

- Advertisment -spot_img