Homeహైదరాబాద్latest Newsఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. 'పుష్ప 2' నుంచి శ్రీవల్లి లుక్ అదిరిపోయిందిగా..!

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ‘పుష్ప 2’ నుంచి శ్రీవల్లి లుక్ అదిరిపోయిందిగా..!

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేషనల్ క్రష్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రష్మిక మందన బర్త్‌డే కావడంతో పుష్ప 2 టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె లుక్‌ను రివీల్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారంతో ధగధగ మెరిసిపోతుంది రష్మిక. చేతికి గాజులు, మెడలో హారాలు, నల్లపూసలు, నడుముకి వడ్డాణంతో ఎక్కడా రిచ్‌నెస్‌లో తగ్గేదేలే అనేలా ఉంది శ్రీవల్లి. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ రష్మికకి బర్త్ డే విషెస్ చెప్పారు.

Recent

- Advertisment -spot_img