సాగుచేసే భూములన్నింటికీ రైతుభరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఎలాంటి సీలింగ్ విధించకుండా ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకూ రూ.7,500 చొప్పున ఏటా రెండు విడతలుగా లబ్ధిదారులకు సాయం అందించనున్నది. బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫాంహౌజ్లకు ఈ స్కీంను అమలు చేయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.