Homeఅంతర్జాతీయంA technical problem with an Air Force helicopter ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​లో సాంకేతిక...

A technical problem with an Air Force helicopter ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య

– పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
– మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఘటన

ఇదే నిజం, నేషనల్ బ్యూరో : ఇండియన్ ఎయిర్ ఫోర్స్​కు చెందిన ఓ హెలికాప్టర్‌ అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్‌ అయ్యింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సమీపంలో పొలాల్లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ఉన్నారు. వీరంతా సురక్షితంగానే ఉన్నట్లు వాయుసేన
ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఫోర్స్​కు చెందిన ఓ హెలికాప్టర్‌ రోజువారీ శిక్షణలో భాగంగా భోపాల్‌ నుంచి చకేరీకి బయల్దేరింది. మార్గమధ్యలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. భోపాల్‌ జిల్లా డుంగరియా గ్రామ సమీపంలోని చెరకు తోటలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ మేరకు సమాచారం అందుకున్న వాయుసేన బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. నాగ్‌పుర్‌ నుంచి మరో నిపుణుల బృందం రానున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img