ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణానికి చెందిన కనపర్తి ప్రభాకర్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు తన ఎడమ కాలు కోల్పోగా, కృత్రిమ కాలు కోసం ఆలయ ఫౌండేషన్ సభ్యులు కీర్తి నాగార్జున మరియు పరికిపండ్ల శ్రీనివాస్ గారిని సంప్రదించగా, పరికి పండ్ల నరహరి ఐ.ఏ.ఎస్ చొరవతో హైదరాబాద్ లోని మహావీర్ సంస్థాన్ వారి సహకారంతో కృత్రిమ కాలు ఉచితంగా పెట్టించడం జరిగింది. ఈ సహాయం చేసిన నరహరికి బాధితుడు కృతజ్ఞతలు తెలియజేశారు.