కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద ఘోరప్రమాదం జరిగింది. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డు దాటుతున్న కారు.. అడ్డుగా వచ్చిన మరో కారును బలంగా ఢీకొంది. దీంతో డివైడర్‌పై నుంచి దూసుకెళ్లిన కారు మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ కారులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదా కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది.